కరోనా వాక్సీన్ .. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !

ప్రపంచ దేశాలు కరోనా వాక్సీన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ‌ ఈ ఏడాది చివరికల్లా వాక్సిన్ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. కరోనాను తుదముట్టించే వ్యాక్సిన్ల తయారీ రేసులో ఇతర దేశాలకు తీసిపోని రీతిలో భారత్‌ ముమ్మర కసరత్తు చేస్తోందని వెల్లడించింది.

ఇప్పటికే దేశంలో ఏడు నుంచి ఎనిమిది వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్లలో మూడు వివిధ ప్రయోగ పరీక్షల దశల్లో ఉండగా, మిగతావన్నీ ఫస్ట్ స్టేజీలో ఉన్నాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన టీకా ముందున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లు ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. మరోవైపు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయని తెలిసింది.