ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు 3.87లక్షల డోసులు రానున్నాయి.
పుణె నుంచి మరికాసేపట్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరనున్నాయి. ప్రత్యేక బందోబస్తుతో గవర్నరంలోని రాష్ట్ర వ్యాధినిరోధక భవనానికి తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిదశలో భాగంగా 3.87 లక్షల మందికి కొవిషీల్డ్ టీకా అందించనున్నారు.
Spread the love