కరోనా వైరస్ ఫస్ట్ బర్త్ డే

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. వాక్సిన్ వస్తేగానీ ఈ మహమ్మారికి చెక్ పడేలా లేదు. ఇక కరోనా వైరస్ పుట్టి నేటితో యేడాది పూర్తయింది. గత యేడాది సరిగ్గా ఈరోజే చైనాలో మొదటి కేసు నమోదైంది. కాబట్టి కరోనా నవంబర్‌ 17, 2020న మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోంది.

ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందోనని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం.. 2019 నవంబర్‌ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు మొత్తం దాదాపు 13.3 లక్షల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.