కాటన్ మాస్కులే సురక్షితం

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.. తప్పక మాస్క్ ధరించాల్సిందే. అయితే అన్నీ రకాల మాస్క్ లు సురిక్షితం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఎన్-95 మాస్కులు కరోనాను నిరోధించేందుకు మెరుగైనవి అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. అయితే వాల్వ్ రెస్పిరేట్లర్లు(ప్రత్యేక కవాటాలు) ఉన్న ఎన్-95 మాస్కులు కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని తాజాగా కేంద్రం ప్రజలను హెచ్చరించింది.

ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. ఇటువంటివి కరోనా వ్యాప్తికి కారణమవుతాయని కూడా లేఖలో పేర్కొంది. వీటికి బదులు ఇళ్లలో కాటన్ దుస్తులతో చేసిన మాస్కులే సురక్షితమని స్పష్టం చేసింది.