తెలంగాణ గవర్నర్ కు కరోనా పరీక్షలు

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా కరోనా పాజిటివ్ గా రావడం ఆందోళన కలిగిస్తొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కోవిడ్‌ నెగెటివ్‌గా తేలింది.

దీనిపై ట్విట్టర్‌ ద్వారా గవవర్నర్‌ స్పందిస్తూ… తాను ఈ రోజు కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. రెడ్‌ జోన్‌లో ఉన్న వ్యక్తులు వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు దయచేసి ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ముందస్తు రోగ నిర్దారణ పరీక్షలు మనల్ని రక్షించడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాయన్నారు.