కేటీఆర్ పేరుతో మోసం.. క్రికెటర్ అరెస్ట్ !


మంత్రి కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే ప్రచారం ఇటీవల జోరుగా జరిగిన సంగతి తెలిసిందే. దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నించారని సమాచారమ్. ఈ లిస్టులో ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఆంధ్రా మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును కేటీఆర్ ని సీఎం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రచారనికి డబ్బులు ఇవ్వాలంటూ.. హైదరాబాద్ రెయిన్ బో ఆసుసత్రి ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ కు ఫోన్ చేశాడు.

తనను తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేటీఆర్ ప్రమాణస్వీకారోత్సవంపై మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. అయితే, రెయిన్ బో ఆసుపత్రి ఎండీ రమేశ్ దీనిపై అనుమానంతో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీయగా నాగరాజు మోసం వెల్లడైంది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది ద్వారా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు.

Spread the love