విషాదం : కరోనాతో క్రికెటర్ కన్నుమూత

కరోనాతో క్రికెటర్ సంజయ్ దోబల్ కన్నుమూశారు. సంజయ్‌ దోబల్.. ఢిల్లీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మిథున్ మన్హాస్‌తో కలిసి ఆడారు. అతను సొనెట్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడి కోచ్‌ తారక్ సిన్హా శిక్షణలో రాటుదేలారు. రంజీలో ఆడనప్పటికీ.. దోబల్ ఎయిర్ ఇండియాతో కాంట్రాక్ట్‌ ముగిసిన తరువాత జూనియర్ క్రికెటర్లకు శిక్షకుడిగా సేవలందించారు.

కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో సంజయ్‌ దోబల్‌ వారం రోజుల క్రితం మహదూర్‌గఢ్‌లోని దవాఖానలో చేరాడు. కొవిడ్ -19 కు పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. మరింత మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆయనను ద్వారకా దవాఖానకు మార్చి ప్లాస్మా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా సోమవారం ఉదయం కన్నుమూశారు