కరోనా టైమ్ లో క్రమ్ రేటు పెరిగింది

కరోనా టైమ్ లో సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయన ఈరోజు సేఫ్ యాప్‌ను ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగంలోచేరే మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఎస్సీఎస్సీ సహకారంతో ఇప్పటికే మార్గదర్శక్, సంఘమిత్రలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మహిళలు పనిచేస్తున్న చోట్ల భద్రతకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యాన్ని నింపే అంశాలను సేఫ్ ఈ-లెర్నింగ్ యాప్‌లో ఉంచామన్నారు.