దర్బార్ ప్రీమియర్ టాక్ : రజనీ వన్ మ్యాన్ షో

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘దర్బార్‌ సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ‘దర్బార్‌’ప్రీమియర్‌
షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

రజనీ వన్‌ మ్యాన్‌ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోయిందని, సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు ఒక్క సెకన్‌ కూడా బోర్‌ కొట్టకుండా వుందని అంటున్నారు. తలైవా వన్‌ మ్యాన్‌ షో. రజనీ ఎనర్జీ, స్టైల్‌, చరిష్మా అందరినీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.