మహమ్మారి కరోనాకు స్వదేశీ వాక్సిన్ వచ్చేసింది. కోవిషీల్డ్ (covishield), కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్లకు DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోద ముద్రవేసింది. ఐతే అత్యవసర సమయంలో వినియోగానికి షరతులతో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
“కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి CDFCO సిఫారసు చేసింది. కోవిషీల్డ్ టీకా భద్రత, సామర్థ్యంపై సీరం సంస్థ వివరాలు సమర్పించింది. ఐసీఎంఆర్, ఎన్ఐవీతో కలిసి కొవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారుచేసింది. కొవాగ్జిన్ భద్రమైనదేనని ఇప్పటికే నిరూపితమయింది. తొలి రెండు దశల్లో 800 మందిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. మూడో దశలో 25,800 మందికి కోవాగ్జిన్ టీకాను ఇచ్చారు. వాక్సిన్ను రెండు డోసలు తీసుకోవాలి. కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో నిల్వ చేయవచ్చు.” అని డీసీజీఐ తెలిపింది.