ప్రభాస్ స్కెచ్ ని రీ ట్విట్ చేసిన దీపిక

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్-దీపికా పదుకొనె జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదో సైన్స్ ఫిక్సన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్-దీపిక ఫోటోలని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.  ఓ అభిమాని ప్ర‌భాస్‌, దీపిక‌ల‌ను క‌లిపి ఓ స్కెచ్ వేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ స్కెచ్ బాగా న‌చ్చ‌డంతో దీపికా ప‌దుకొనె త‌న ఇన్‌స్టా అకౌంట్ ద్వారా స్కెచ్ రీ పోస్ట్ చేశారు. ఫ్యాన్ ఆర్ట్ ఫ్రైడే సిరీస్ ఆఫ్ స్టోరీస్ అంటూ కామెంట్‌ను కూడా దీపిక‌ పోస్ట్ చేయ‌డం విశేషం.