డిజిటల్ విద్యకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరోనా ఎఫెక్ట్ తో విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో స్కూల్స్ తెరచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విద్యను డిజిటలైజ్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆదివారం ఆఖరి ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ విద్యపై ప్రకటన చేసారు.  ఇప్పటికే స్వయంప్రభ ఛానల్ ద్వారా విద్యను అందిస్తున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి పేర్కొన్నారు.

త్వరలోనే 12 ఛానల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యను బోధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. ఈ స్వయంప్రభ చానళ్ళు ఎయిర్ టెల్, టాటా స్కై డిటిహెచ్ ద్వారా ప్రసారం అవుతాయని అన్నారు. గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం వలన విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసినట్టు అవుతుందని నిర్మల అన్నారు.