తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టు ఏమంది అంటే.. ?

కరోనా ప్రభావంతో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ లోగా తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి, వాటిని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం తరఫున ఏజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామన్నారు. అయితే, పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ద్వారా గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి కోరారు. పరీక్షల విషయంలో యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్నహైకోర్టు మూడు వారాల్లో పరీక్షల నిర్వహణపై వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.