ఢిల్లీ సీఎం.. ఆల్ పార్టీ మీటింగ్ !

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహిస్తుండటం ప్రాధాన్యతని సంతరించుకుంది. గురు టెగ్ బహదుర్ అసుపత్రి సందర్శించిన తర్వాత క్రేజీవాల్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

అక్కడి డాక్టర్లు మరో 232 మంచాలను పెంచేందుకు అంగీకరించారు. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 663 ఐసీయూ మంచాలను మరి కొద్ది రోజులలో పెంచనున్నారన సీఎం చెప్పారు. అంతేకాకుండా కేంద్రం మరో 750 మంచాలను పెంచనుందనీ అన్నారు. ఇంతటి దారుణ పరిస్థితులలోనూ డాక్టర్లు కరోనాను అదుపులో ఉంచారని చెప్పారు.