డేవిడ్ వార్నర్ ఆఖరి పంచ్ అదిరింది

ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ స్టార్ మాత్రమేకాదు.. సోషల్ మీడియా స్టార్. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు.

తాజాగా వార్నర్ మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘మహర్షి’ సినిమా నుంచి రీఫేస్ యాప్ తో తానే ఓ మహర్షిలా కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో మహేష్ ఫేస్‌కు బదులు తన ఫొటోని యాడ్ చేసి సరికొత్త వీడియో షేర్ చేశాడు వార్నర్. దీంతో ఇలా ఈ ఏడాదిని ముగిస్తున్నాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

View this post on Instagram
Spread the love