అచ్చెన్నాయుడు తరలింపు.. దేవినేని ఫైర్ !

మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టుని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టై చాన్నాళ్లయినా.. ఇప్పటికే ఆయన అరెస్ట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఫైర్ అయ్యారు.

శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ వాహనంలో తరలింపా? దారిపొడవునా రక్తస్రావం. రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తారా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది జగన్‌ గారు అంటూ దేవినేని ట్విట్ చేశారు. వ్యవసాయ బడ్జెట్‌లో ఖర్చు చేసింది మూడోవంతు మాత్రమే. మాఫీ బకాయిలు 7 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. రైతులను కులాల పేరుతో విభజించి 13 లక్షల మంది కౌలు రైతులను ముంచారు. ధరల స్థిరీకరణ నిధులెక్కడ ఖర్చుపెట్టారు? అంటూ ప్రశ్నించారు.