ధోని కొత్త అవతారం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మంచి ఆటగాడు మాత్రమే కాదు.. మంచి పాటగాడు కూడా. ఫ్యామిలీతో కలసి ఓ కార్యక్రమంలో సరదాగా గడిపిన ధోని స్నేహితులతో కలిసి ఓ పాట పాడారు. ధోనీ స్నేహితురాలు, టెలివిజన్ నటి ప్రీత్ సిమోస్ ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేస్తున్నా. నన్ను చంపకు అంటూ.. తన ఇన్‍స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

ఇక ప్రపంచ కప్ 2019 తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి దిగని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్డ్మెంట్ పై హాట్ హాట్ గా చర్చజరుగుతోంది. ధోని మాత్రం ఎప్పటిలాగే కూల్ గా దొరికిన సమయాన్ని ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చే ఐపీఎల్ లో ధోని మళ్లీ మైదానంలో చూసే అవకాశం రానుందని తెలుస్తోంది. చైన్నై జట్టుని ధోని ముందుండి నడిపించనున్నారు.