‘ధూమ్ 4’ లో ప్రభాస్..?

బాహుబలి , సాహో చిత్రాలతో ప్రభాస్ రేజ్ ఎక్కడికి వెళ్లిందో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సాహో చిత్రం బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టి అక్కడి స్టార్ హీరోలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ప్రభాస్ రేంజ్ దృష్ట్యా బాలీవుడ్ లో భారీ ఫిలిం చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు బి టవన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిలింస్ తాజాగా ప్రభాస్ కు భారీ ఆఫర్ ఇచ్చిందట. ‘ధూమ్’ సిరీస్‌లోని మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా.. ఇప్పుడు యశ్ రాజ్ ఫిలింస్ ‘ధూమ్ 4’ ను తెరకెక్కించే పనిలో ఉందట. ఇందులో హీరోగా ప్రభాస్‌ను ఎంపిక చేసుకోవడానికి నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్త ప్రభాస్ కు చేరిందని..ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీ చేయాలా..వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే చేస్తే మాత్రం ఫ్యాన్స్‌కు అంతకంటే పెద్ద పండుగ ఉండదనే చెప్పాలి.