ప్రతి విద్యార్థికి డిజిటల్ డివైస్ ఇవ్వాలి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.  ప్రతి విద్యార్థికి బేసిక్ డిజిటల్ పరికరం కావాలని ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్ తెలిపారు. ఆన్‌లైన్ విద్య వల్ల చాలా మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ లేని కారణంగా మహారాష్ట్రలో పదవ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్లు చెప్పారు. దేశంలో 240 మిలియన్ల విద్యార్థి జనాభా ఉన్నదని, మన యువతను మనం కోల్పోలేమని ఎంపీ తెలిపారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో నిరుద్యోగ సమస్య అంశాన్ని రాజ్యసభలో జీరో అవర్‌లో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ లేవనెత్తారు. 13 నెలల క్రితం కశ్మీర్ హోదాను తప్పించడంతో.. అక్కడ టూరిజం పడిపోయిందన్నారు. ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వ్యవహారాలు దెబ్బతిన్నాయన్నారు. కశ్మీర్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను మళ్లీ ప్రారంభించాలని ఆజాద్ తెలిపారు.