’డించక్.. డించక్..

యంగ్ హీరో తాజా చిత్రం ’రెడ్‘ నుండి సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ రోజు రామ్ పుట్టినరోజు కావడంతో, ఈ తాజా వీడియో సాంగ్ రిలీజ్ చేసి, చిత్ర యూనిట్ రామ్ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. ఇదో స్పెషల్ సాంగ్. రామ్ తో కలిసి హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఈ సాంగ్ లో చిందేసింది. ’డించక్.. డించక్..‘ అంటూ సాగే ఈ సాంగ్ లో స్టెప్పులు అదిరిపోయాయి.

సూపర్ హిట్ మూవీ ’ఇస్మార్ట్ శంకర్‘ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే, బెస్ట్ కాంబినేషన్ అయిన రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో సినిమా కావడం మరో విశేషం.