‘దిశ’ది సాయం చేసే గుణం : టీచర్స్

దిశ ఘటన యావత్ దేశాన్ని ద్రిగ్బాంతికి గురిచేసింది. నలుగు క్రూర మృగాలు దిశని అతి దారుణంగా హత్య చేసి.. హత మార్చి తగలపెట్టడం మనసులని కలిచే వేస్తోంది. ఆ నలుగురి నిందితులని తక్షిణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు దిశ గొప్ప మనసుని తలుచుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

దిశ విద్యాబ్యాసం వరంగల్ లో సాగింది. 8 నుంచి 10వ తరగతి వరకు వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో చదివింది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ వసతి గృహంలో ఉండి చదువుకునేది. పదో తరగతిలో 536 మార్కులు సాధించింది. సహాయ గుణం కలిగిన దిశ పాఠశాల ఇచ్చే మోస్ట్‌ హెల్పింగ్‌ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయిందని పాఠశాల డైరెక్టర్‌ భరద్వాజనాయుడు తెలిపారు.

సోమవారం కుటుంబసభ్యులు, దిశ స్నేహితులతో కలిసి బీచుపల్లికి చేరుకున్న తండ్రి దిశకు అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు. దిశ అస్థికలను ఆమె తండ్రి జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.