లోక్‌స‌భ‌ అంత దిశ ఘటన గురించే చర్చ..

దిశ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరో నిర్భయ కేసుగా దిశ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన తో మరోసారి ఆడవారికి భద్రత లేదనేది తేలింది. పోలీసుల నిర్లక్ష్యం ఒకిత్త కారణమని..వారే ముందే కేసును తీసుకుంటే దిశ మరణించేది కాదని కొంతమంది వాదన..ఈ సంగతి పక్కన పెడితే ఈ ఘటనకు పాల్పడిన వారికీ మాత్రం మరణ శిక్ష వేయాలని..అది కూడా త్వరగా జరిగిపోవాలని..ఆలా జరిగితేనే ఇలాంటి నేరాలు ఆగుతాయని ప్రతి ఒక్కరి మాట. ఇదే విషయం లోక్ సభ లో మాట్లాడారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌రావు.

దిశ అత్యాచార నిందితుల‌కు 30 రోజుల్లోగా క‌ఠిన శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని లోక్ సభ లో డిమాండ్ చేసారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే నిందితుల‌ను పట్టుకున్నామని.. హైద‌రాబాద్ దిశ ఘ‌ట‌న ఇప్పుడు దేశ స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు, యూపీల్లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో 30 రోజుల్లోనే నిందితుల‌ను శిక్షించాలని కోరారు. అలాగే నిన్న మంత్రి కేటీఆర్ సైతం మోడీకి దిశ ఘటన ఫై తన ట్విట్టర్ ద్వారా వివరించడం జరిగింది..