కరోనాతో పెంపుడు కుక్క మృతి

మనుషులనే కాదు జంతువులని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఓ పిళ్లికి కరోనా సోకిందనే న్యూస్ వినిపించింది. తాజాగా అమెరికాలో కరోనాతో ఓ పెంపుడు శునకం మరణించింది. అమెరికాలో కరోనాతో మరణించిన మొదటి శునకం అదే. జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం మరణించిందని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలిపింది.

ఈ శునకానికి ఏప్రిలో శ్వాస కోస సమస్య తలెత్తింది. దీంతో దానికి పరీక్షలు చేపించగా.. కరోనా పాటిజివ్ అని తేలింది. ఏడేళ్లు ఉన్న బుడ్డీ అనే ఈ శునకానికి ముక్కు మూసుకుపోవడంతో రక్తపు వాంతులు చేసుకొని మరణించిందని మహోనీస్ చెప్పారు.