దోస్త్ రిజిస్ట్రేషన్లు వాయిదా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేటినుంచి ప్రారంభంకావాల్సిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు వాయిదా వేస్తున్నస్తున్నట్లు దోస్ట్‌ కన్వీనర్‌ లింబాద్రి ప్రకటించారు. దోస్త్‌ ప్రక్రియ తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాయిదావేసింది. మరోవైపు 15రోజుల పాటు హైదరాబాద్ లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.