గ్రేటర్ ఎన్నికలు : రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు కోటలు దాటుతున్నాయ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దృష్టిసారించింది.

పలువురు నేతలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రసంగించినట్లు ఎస్‌ఈసీ గుర్తించింది. రాజకీయ పార్టీ నేతల ప్రసంగాలపై హెచ్చరికలు జారీ చేసింది. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మీడియా ద్వారా అన్నింటినీ గమనిస్తున్నాం. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రసంగిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ప్రచారంలో అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ హెచ్చరించింది.

Spread the love