ట్రైలర్ టాక్: ‘ఎంత మంచివాడ‌వురా’ ?

శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీ‌నివాస క‌ల్యాణం తర్వాత స‌తీష్ వేగేశ్న నుండి వస్తున్నా సినిమా ‘ఎంత మంచివాడ‌వురా’ . కళ్యాణ్ రామ్ హీరో. ఈ సినిమా ట్రైల‌ర్ వచ్చింది. “తాత‌య్య ద‌గ్గర సూర్య, ఊర్లో శివ‌, ఈ అమ్మాయి ద‌గ్గర రిషి… ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, ఒక్కో రిలేష‌న్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు..” – అంటూ ట్రైల‌ర్ ప్రారంభంలోనే హీరో క్యారెక్టరైజైష‌న్ చెప్పేశారు ఇందులో.

క‌థ‌లో, ద‌ర్శకుడు ఎంచుకున్న పాయింట్‌లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్నాయి. అయితే అంత వ‌ర‌కే ఆగిపోలేదు. ఆ ఊర్లో ఓ విల‌న్‌ని ప్రవేశ పెట్టించి – యాక్షన్ కి రంగం సిద్ధం చేశారు. ఆ పాత్ర‌లో రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తున్నాడు. సంక్రాంతి సీజ‌న్ లో ఫ్యామిలీ సినిమాల‌కు ఎంత వెయిటేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మరి ఈ సినిమా ఎంత వరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.