ఈపీఎఫ్ కొత్త నిబంధన

ఈపీఎఫ్ఓ మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. 100 లోపు ఉద్యోగులున్న సంస్థల్లో రూ. 15 వేల లోపు వేతనం ఉన్న ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కొత్త నిబంధనలో భాగంగా.. 12 శాతం చొప్పున ఉన్న ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్‌ను 10 శాతానికి తగ్గించింది. దీంతో.. మే, జూన్, జూలై నెలలకు ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం 24 శాతం కాకుండా కేవలం 20 శాతం చొప్పున జమ అవుతుంది. దీని వలన ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల టేక్ హోమ్ సాలరీ పెరుగుతుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది.

ఉద్యోగులు కావాలంటే తమ వాటాను 10 శాతం నుంచి పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఉద్యోగులు కోరుకుంటే గతంలోలాగే 12 శాతం చొప్పున ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధన రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ.15 వేల లోపు వేతనం పొందుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి వర్తించదు.