నాయినికి ఈటెల పరామర్శ

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. నాయిని నర్సింహారెడ్డి ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నారు. దాని నుంచి త్వరగానే కోలుకున్నారు. అయితే ఆయన న్యూమోనియా బారినపడ్డారు. దాంతో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో నాయిని ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రిలో చేరారు.