పెట్రో ధరల పెరుగుదల.. మాజీ ఎంపీ విన్నూత నిరసన !

దేశంలో పెట్రో ధరల పెరుగుదల ఆగడం లేదు. రెండ్రోజుల గ్యాప్ తర్వాత తాజాగా పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ పెట్రో ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల వరకు ఒంటైపై కూర్చుని ప్రయాణించారు.

ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్‌ను మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హర్షకుమార్ హెచ్చరించారు. అయితే హర్ష కుమార్ నిరసనపై ఏపీలో పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Spread the love