వావ్.. ఇంటి దగ్గరే పరీక్షలు !

కరోనా కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ, పీజీ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ ఫైనల్ ఇయర్, పీజీ నాలుగో సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఈ పరీక్షలను ఇంటి నుంచే రాసుకునే అవకాశం కల్పించబోతున్నది. జవాబుల కోసం అవసరమైతే పుస్తకాలను రిఫర్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. పరీక్షలు రాసిన తరువాత ఆన్సర్ షీట్స్ ను సంబంధించిన కేంద్రాలలో ఇవ్వాలని అధికారులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.