TS : కర్మ చారికే తొలి టీకా

ఈ నెల 16 నుంచి దేశంలో కరోనా టీకాని పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మ చారి అంటే పారిశుధ్య కార్మికునికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈరోజు ఇవాళ తెలంగాణకు 20 వేల కోవాగ్జిన్ డోసులు కూడా వచ్చి చేరాయి. 139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్ లో 30 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నారు. మొదట్లో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు..తర్వాత ప్రయివేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వేయనున్నారు. తర్వాత రోజు అంటే రెండవ రోజు 50.. ఆ తర్వాత రోజు 100 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

Spread the love