ఢిల్లీ జైలులో ఐదుగురికి కరోనా

ఖైదీలు కరోనా మహమ్మార్ బారినపడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలోని జైళ్లలో ఐదురుగు ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇదివరకు 45 మంది ఖైదీలు కొవిడ్‌ బారినపడ్డారు. అలాగే, 75మంది జైలు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

కరోనా రోగుల కోసం అక్కడి జైలు పరిపాలన అధికారులు ఐసోలేషన్‌ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఖైదీలకు స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 20 వరకు, 4,129 మంది ఖైదీలను వివిధ జైళ్ల నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే.