భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు కార్ల్ టన్ సడెన్ డెత్

భారత ఫుట్ బాల్ లో విషాదం నెలకొంది. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కార్ల్ టన్ (49) కన్నుమూసారు. ఆయన ఆదివారం రాత్రి తీవ్రమైన వెన్నునొప్పితో బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటున్న టైమ్ లో గుండెపోటుతో కన్నుమూశారు.

1980లో బెంగళూరులోని సాయ్ సెంటర్‌లో తన కెరీర్ ప్రారంభించారు చంపాన్. బెంగళూరు క్లబ్‌కి చెందిన సదరన్ బ్లూస్ తరపున ఆడారు. 1990లో టాటా ఫుట్‌బాల్ అకాడెమీలో చేరారు. 1993 వరకూ క్లబ్‌తో ఉండి… గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి… ఈస్ట్ బెంగాల్ వెళ్లారు. అక్కడ రెండేళ్లు ఆడి… 1995లో జేసీటీ మిల్స్ కి సైన్ చేశాడు. 1993లో ఆసియన్ కప్‌లో బెంగాల్ ఫస్ట్ సీజన్‌లో హ్యాట్ ట్రిక్ కొట్టి… ఇరాకీ క్లబ్ అల్ జవ్రాకి షాక్ ఇచ్చాడు. చంపాన్ మృతిపట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు.