ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ చెల్లెలు హల్ చల్ !

ఢిల్లీలో బురఖా ధరించిన ఓ మహిళ గ్యాంగ్ స్టర్ చెల్లెలుని అంటూ హల్ చల్ చేసింది. బ్యాగులోంచి గన్ తీసి కాల్పులు జరిపింది. ఈ ఘటన ఢిల్లీలోని చౌహాన్ బంగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వారికి లభించింది.

నవంబరు 18న చౌహన్ బంగర్ ప్రాంతంలోని ఓ దుకాణదారుతో బురఖా ధరించిన ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. వెంటనే తన బ్యాగ్‌లోనుంచి గన్ తీసి అతడికి గురిపెట్టింది. ‘నాతోనే గొడవపడతావా? నీకెంత ధైర్యం? నేనెవరో తెలుసా..?’ అంటూ హడలెత్తించింది. భయపడిపోయిన షాపు యజమాని వెంటనే షటర్ దించేసి లోపల ఉండిపోయాడు. ఆ మహిళ తన చేతిలోని గన్‌తో మూసివేసిన షటర్‌పై కాల్పులు జరిపింది. ఒక్కసారిగా గన్ సౌండ్ వినడంతో చుట్టుపక్కల ఉన్నవారు బెంబేలెత్తిపోయారు.

Spread the love