గంగూలీ హెల్త్ బులిటెన్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనారోగ్యంతో కోల్ కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసుపత్రి వర్గాలు గంగూలీ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. ఛాతీనొప్పి కారణంగా గంగూలీ ఆసుపత్రిలో చేరారని అందులో తెలిపింది.

ఇంట్లోని జిమ్‌లో ట్రెడ్ మిల్ చేస్తుండగా.. ఛాతీలో నొప్పి వచ్చినట్లు చెప్పింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దాదా ఆసుపత్రికి వచ్చాడని, ఆ సమయంలో అతని పల్స్ రేటు నిమిషానికి 70, బీపీ 130/80గా ఉన్నదని వెల్లడించింది. ఆయనకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహిస్తున్నట్లు వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ చెప్పింది. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది.

Spread the love