వరంగల్ బావి ఘటన నిందితుడు ఇతడే !

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో బావిలో 9 శవాలు మృతులు బయటపడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంజయ్ అనే నిందితుడు 9 మందిని హత్యచేసి బావిలో పడేశాడు. పుట్టినరోజు వేడుక సమయంలో మక్సూద్ కుటుంబాన్ని హత్య చేయాలనీ పక్కాగా ప్లాన్ చేసుకొని సంజయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 9 హత్యలు తానే చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

నిందితుడిని పట్టుకొనే క్రమంలో పోలీసులు తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తోంది. కేసు విచారణలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. సిసీ కెమెరా ఫుటేజీని ప్రధాన ఆధారంగా చేసుకుని పోలీసులు నిందుతుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ను గుర్తించారు. ఈ కేసును ఛేదించేందుకు మొత్తం ఆరు బృందాలను రంగంలోకి దింపినట్లు వరంగల్‌ సీపీ రవీందర్‌ మీడియాకు తెలిపారు. సంజయ్‌ ప్రతి కదలిక సీసీ కెమరాల్లో నమోదయినట్లు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం నిందుతున్నిజాన్‌పాక్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వివరించారు. సంజయ్‌ని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలను రాబడతామని చెప్పారు.