గ్రేటర్ పోరు : ముగిసిన నామినేషన్స్ గడువు

గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు ఒక్కరోజే 600లకు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.

గురువారం వరకు 537 మంది అభ్యర్థులు 597 నామిషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 1000కి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నామినేషన్లననీ పరిశీలిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు.