గ్రేటర్ ఎలక్షన్స్ : జోన్లవారీగా IPSలకు బాధ్యతలు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని జోన్ల వారీగా పోలీసు ఉన్నతాధికారులకు సీపీ అంజనీకుమార్‌ బాధ్యతలు అప్పగించారు.

తూర్పు మండలం ఇన్‌చార్జిగా షికా గోయల్‌, పశ్చిమ మండల ఇన్‌చార్జిగా అనిల్ కుమార్‌, సౌత్ జోన్ ఇన్‌చార్జిగా డీఎస్ చౌహాన్‌, మధ్య మండల ఇన్‌చార్జిగా తరుణ్ జోషి, తూర్పు మండలం ఇన్‌చార్జిగా అవినాశ్ మహంతిని నియమించారు.