గ్రేటర్ నామినేషన్ల పరిశీలన నేడే  

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. వాటిని ఎన్నికల అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. ఫార్మ్-ఏ ఇచ్చేందుకు ఇప్పటికే గడువు ముగిడంతో అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు బీ-ఫార్మ్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఆ తర్వాత గ్రేటర్ పరిధిలో ఎంత మంది బరిలో ఉన్నారు అన్నదానిపై స్పష్టత రానుంది.

గ్రేటర్ లో మొత్తం 150 వార్డులకు గాను 1,633 మంది అభ్యర్థులు 2,226 నామినేషన్లు దాఖలుచేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌- 493, బీజేపీ-494, సీపీఐ-15, సీపీఎం-24, కాంగ్రెస్‌-312, మజ్లిస్‌-66, టీడీపీ-186, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు- 86, స్వతంత్రుల నుంచి 550నామినేషన్లు దాఖలయ్యాయి.

Spread the love