కేటీఆర్’కు మీ స్మైల్ గిఫ్ట్ గా ఇవ్వండి

ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తెరాస శ్రేణులు సోషల్ మీడియా వేదికగా మొదలెట్టేశారు. అయితే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఒకరికొకరు తోడుగా ముందుకు నడువాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల నేతృత్వంలో రాష్ట్రం కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని మేయర్ తెలిపారు. జులై 24న కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌కు పిలుపునిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. పుట్టిన రోజున పూల బొకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు, హోర్డింగుల మీద డబ్బు ఖర్చు చేయకుండా.. సాటి మనిషికి సాయపడదాం. వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ పేద ప్రజలకు అవసరాలు తీర్చాలి. ఇదే మన నాయకుడికి ఇచ్చే అసలైన గిఫ్ట్ అన్నారు.