గోల్డ్ ధర పెరిగింది. కానీ డిమాండ్ పడిపోయింది !

ఇటీవల కాలంలో గోల్డ్ ధరలకి రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. తులం బంగారం ధర రూ. 52వేలు దాటేసింది. అయితే బంగారం డిమాండ్ మాత్రం బాగా తగ్గింది.  26 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. బంగారం అంటే ఎంతో ఇష్టపడే భారతీయులు పసిడి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు

తాజాగా  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించిన ప్రకారం.. భారత్‌లో బంగారం డిమాండ్ 2020లో ఏకంగా 26 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని అంచనా వేసింది. ఓవైపు అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధర పెరగడానికి ఊతం ఇవ్వడగా.. కరోనా కారణంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడిందని డబ్ల్యూజీసీ పేర్కొంది.