అర్చకులకి సీఎం జగన్ కానుక

మూడు, నాల్గో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దుకాణాలు, కార్యాలయాలు.. తెరచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దేవాలయాలకి మాత్రం ఇంకా అనుమతి లభించలేదు. అన్ని మతపరమైన దేవాలయాలు మాత్రం ఈనెల 31 వరకు మూసే ఉందనున్నాయి. దీంతో చిన్న చిన్న దేవాలయాల్లోని అర్చకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అర్చకులకి ఆదుకోవాలని నిర్ణయించారు.

దేవాలయాల్లో పనిచేస్తున్న 31,017 మంది అర్చకులకు రూ.5వేల రూపాయలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అర్చకులతో పాటు 7వేలమంది ఇమాంలు, మౌజంలు, 29,841 మంది పాస్టర్ల ఖాతాల్లోకి కూడా రూ.5వేలు జామకాబోతున్నాయి. దీని కోసం ఏపి ప్రభుత్వం రూ. 33.93 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. మరోవైపు అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.