గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి అనేక నిర్ణయాలను తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ అనేక మంది అంగవైకల్యానికి గురైన వారున్నారు. వీరికి కేంద్రం నుంచి సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది.

అయితే అంగవైకల్యం వచ్చిన తరువాత కూడా ఉద్యోగం మానకుండా విధులను కొనసాగిస్తున్న వారికి మాత్రమే ఈ సాయం అందనున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కీలక నిర్ణయం ఎక్కువగా ఉపయోగపడేది కేంద్ర భద్రతా బలగాలకే అని చెప్పాలి. ఎందుకంటే దేశం కోసం పోరాడి అంగవైకల్యానికి గురయ్యే వారు వందల నుంచి వేల సంఖ్యలో ఉంటారు. దేశం కోసం తమ అవయవాలను పోగొట్టుకున్న వారికి ఎంత సాయం చేసినా తక్కువేనని చెప్పాలి.

Spread the love