తెలంగాణ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్ ను 30 శాతం తగ్గించాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు నష్టపోయిన పనిరోజులకు అనుగుణంగా ఈ సిలబస్‌ని తగ్గించనున్నారు. సీబీఎస్‌ఈ మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్ట్‌ల్లో విధించిన కోత సిలబస్‌కి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్ సిలబస్ ను తగ్గించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఉండే 222 పనిదినాలను ఈ ఏడాది 40 రోజులు తగ్గించి, 182 రోజులకు పరిమితం చేశారు.