సినీ ప్రయులకి జియో గుడ్ న్యూస్

ముందు మురిపించి.. తర్వాత ఏడిపిస్తుంది జియో నెట్ వర్క్స్. మొదట్లో చాలా తక్కువ రేటుకి అద్భుతమైన ప్లాన్స్ ఇచ్చిన జియో.. ఇప్పుడు రేట్లని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో కస్టమర్స్ గుర్రుగా ఉన్నారు. వారిని కూల్ చేసే న్యూస్ ఒకటి జియో నుంచి వచ్చింది. జియో సినిమా.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన సన్‌ నెక్ట్స్‌ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది.

సన్‌ నెక్ట్స్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది. తద్వారా జియో యూజర్లకు సన్‌ నెక్ట్స్‌ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. సన్‌ నెక్ట్స్‌ మూవీ కేటలాగ్‌తో అపరిమిత సినిమాలు చూసే వీలును దక్షిణాది ప్రేక్షకులకు కల్పించింది. ఇది సినీ ప్రియులకి గుడ్ న్యూసే మరీ.. !