మందు బాబులకి ఏపీ హైకోర్ట్ తీపికబురు

ఏపీ హైకోర్ట్ మందుబాబులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యం ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ; హైకోర్టులో దాఖలైన టువంటి వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

హైకోర్ట్ తీర్పు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలానే ఉంది. 13 జిల్లాలు ఏపీలో ఉంటే, 12 జిల్లాలు ఇతర సరిహద్దులను పంచుకుని ఉన్నాయి.ఇప్పుడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఒక పది మంది తలొక బండి వేసుకుని వెళ్లి తలో మూడు ఫుల్ బాటిల్స్ తెచ్చుకోవచ్చు. అంటే 30 బాటిల్స్ ఈజీగా వస్తాయి. అప్పుడు పోలీసులు కూడా చేసేది ఏమీ ఉండదు. కేసులు నమోదు చేస్తే అంతిమంగా ఇబ్బంది పడేది పోలీసులే.