ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులకి గుడ్ న్యూస్

ఆర్టీసీ కార్మికులకి ఇచ్చిన హామీలని సీఎం కేసీఆర్ నిలబెట్టుకొన్నారు. ఇప్పటికే సమ్మె కారణంగా చనిపోయిన 38 మంది కార్మికుల్లో ఇప్పటికే 33 మంది కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించారు. మరికొంత మందికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా 240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వహించిన డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం కేసీఆర్ ఆర్టీసీ పురోగతి, ఉద్యోగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. విధాన పరమైన నిర్ణయాల కార్యాచరణ అమలు తీరుతెన్నులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సంస్థ అభ్యున్నతి కోసం తీసుకోవల్సిన మరిన్ని చర్యల్ని ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు సూచించారు.