రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైతు వద్దకేవెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సారి కూడా ప్రభుత్వ సంస్థలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని, మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులు, అధికారులతో మరోమారు సీఎం సమీక్ష నిర్వహించారు.

కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ సంస్థలను గ్రామాలకు పంపి రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు. వరికోతల కార్యక్రమం 45 రోజుల పాటు సాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెంటింగ్‌, పౌరసరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.