తెల్లరేషన్ కార్డుదారులకి గుడ్ న్యూస్

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డు దారులకి ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రెండుసార్లు పంపిణీ చేసింది. జూన్ 1 నుంచి మూడోసారి పంపిణీకి సిద్ధమవుతోంది. ఆహార భద్రత కార్డు ఉన్న అందరికీ బియ్యం ఇచ్చేందుకు రూ.46వేల కోట్లు మంజూరు చేసింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత బియ్యాన్ని పొందగలరు. ఒక్కో వ్యక్తికీ 12 కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే… కేజీ కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. తెలంగాణలో 87.55 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ ప్రకారం 2.80 కోట్ల మంది లబ్దిదారులుగా ఉన్నారు.