ఎంఎస్‌ ధోనీ నినాదాలు వింటూనే పంత్ సత్తా చాటాలి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ ని ఎంపిక చేస్తున్నారు. ఐతే, పంత్ మాత్రం ప్రతిసారి నిరాశపరుస్తున్నాడు. ఈనేపథ్యంలో.. పంత్ ఎంపికపై విమర్శలు వెలువెత్తుతున్నాయ్. పంత్ స్థానంలో భీకర ఫామ్ లో ఉన్న మరో యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ ని తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ కి అండగా నిలిచారు బీసీసీఐ బాస్ గంగూలీ.

‘మైదానంలో ధోని నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం అవ్వడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి. ప్రతిసారీ మనకు ఎంఎస్‌ ధోనీ అందుబాటులో ఉండడు. మహీ సాధించింది పంత్‌ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది” అన్నారు గంగూలీ.